Sunday, August 30, 2015

Welcome to my blog

Hi,

Welcome to my blog. Let us share our thoughts about things that matter in our lives and learn from each other to make our society an informed one and meaningful.

-Jinka Nagaraju

1 comment:

  1. Naidu places Amaravati invite at the feet of Lord Balajiశ్రీవేంకటేశ్వరునికి
    అమరావతి ఆహ్వాన పత్రికను సమర్పించిన సీఎం చంద్రబాబు
    తిరుమల, అక్టోబర్ 18: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య ఆశీస్సులతో తాము నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని నిర్మించబోతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆదివారం అమరావతి శంకుస్థాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను సీఎం శ్రీవారి పాదపద్మాల వద్ద వుంచి ఆశీస్సులు పొందారు. తర్వాత టిటిడి ఏడుకొండలలో సేకరించిన ఏడు తీర్థాల పవిత్ర జలాలను, నేలతల్లి మట్టిని వైభవోత్సవ మంటపానికి కుటుంబ సభ్యులతో కలసి తీసుకొచ్చారు.
    తిరుమల సప్తగిరులలో సేకరించిన పవిత్రజలాలు, నేలతల్లి మట్టిని అమరావతి నిర్మాణానికి దేవదేవుని ఆశీస్సులుగా భావిస్తున్నామన్నారు. వీటిని అమరావతికి తరలిస్తామన్నారు. రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల నుంచే కాకుండా, దేశంలోని ప్రధాన దివ్యధామాల నుంచి, చారిత్రక ప్రదేశాల నుంచి పవిత్ర జలాలు, మట్టిని సేకరించి తీసుకువస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును అభినందించారు. దేశం నలుమూలలా స్వాతంత్ర్య సమరయోధులు నివసించిన చారిత్రక ప్రదేశాలనుంచి మట్టిని తీసుకువస్తామని, వారిచ్చిన ఉత్తేజం,స్ఫూర్తితో అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
    ఆయన దీవెనలతో ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించే అవకాశం రావటం తన అదృష్టమని అన్నారు. కేవలం విశ్వశ్రేణి ప్రమాణాలతో కూడినదే కాకుండా అత్యుత్తమ కళాత్మక, సౌందర్యనగరంగా, ఈ-హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. పవిత్ర జలాలను, మట్టిని సేకరించటంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చురుకైన పాత్ర పోషించిందని, ఇందుకు టిటిడిని అభినందిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
    రాజధానిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు చేపట్టిన ‘మన నీరు-మన మట్టి’, ‘మన అమరావతి-మన ఇటుక’ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం నుంచే కాక దేశ, విదేశాలలో నివసిస్తున్న తెలుగువారు ఈ పవిత్ర క్రతువులో పాలుపంచుకుంటున్నారని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టిటిడి చైర్మన్ శ్రీ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో శ్రీ డి. సాంబశివరావు, జేఈఓ శ్రీ కె. శ్రీనివాసరాజు, పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ గోపీనాథ్ జెట్టి, బోర్డు సభ్యులు డా. హరిప్రసాద్, డిపి. అనంత, శ్రీమతి సువర్చల ఎల్లా, డిప్యూటి ఈవో చిన్నంగారి రమణ, పేషికార్ ఆర్ సెల్వం తదితరులు పాల్గొన్నారు.

    ReplyDelete